తుపాకుల మోతతో వణికిన ఢిల్లీ! యువకుడిపై బుల్లెట్ల వర్షం!

దేశ రాజధాని ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. రాజా మేవతి అనే 23 ఏళ్ల యువకుడిపై గుర్తుతెలియని దుండగులు దాదాపు 8 రౌండ్ల కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

May 27, 2026 - 11:16
 0  5
తుపాకుల మోతతో వణికిన ఢిల్లీ! యువకుడిపై బుల్లెట్ల వర్షం!

ఒకప్పుడు ఇతర దేశాల్లో కాల్పుల మోత జరిగింది అని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా కాల్పుల మోత ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల మోత ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో 23 ఏళ్ల యువకున్ని గుర్తు తెలియని అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 

అక్కడున్న స్థానికుల కథనం ప్రకారం : ఖజురి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆ యువకుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడిని రాజా మేవతి అలియాస్ అక్కి అలియాస్ ఆకిబ్ గుర్తించారు. 

కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అటు ఫారెన్సీ బృందం కూడా రంగంలోనికి దిగి ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఇలా వరుసగా ఢిల్లీలో కలుపుల మోత ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేస్తుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 1
Wow Wow 0
Bharath About Me I am an independent news blogger with a passion for staying on top of general news and current events. For me, this isn’t just a job; it’s a dedicated hobby focused on bringing clarity to the daily headlines. I believe in quality over speed—which is why I personally verify every piece of information before it hits this site. My goal is to provide you with news you can trust, delivered with an individual perspective. నా గురించి నేను ఒక స్వతంత్ర వార్తా బ్లాగర్‌ని. తాజా వార్తలు మరియు సామాజిక అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం నాకో ఇష్టం. ఇది నాకు కేవలం వృత్తి మాత్రమే కాదు, వార్తల్లోని నిజానిజాలను స్పష్టంగా అందించాలనే ఒక చిన్న ప్రయత్నం. నేను వేగం కంటే నాణ్యతకే ప్రాముఖ్యత ఇస్తాను—అందుకే ఏదైనా వార్తను పోస్ట్ చేసే ముందు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. నమ్మకమైన సమాచారాన్ని ఒక వ్యక్తిగత కోణంలో మీకు అందించడమే నా లక్ష్యం.