తెలంగాణలో నిప్పుల కొలిమిలా ఎండలు: ఒకే రోజు 17 మంది బలి
తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. ఎండ దెబ్బకు ఒకే రోజు 17 మంది ప్రాణాలు కోల్పోగా, పలు జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరించిన ఆ 11 జిల్లాలు ఏవో, అధికారులు ఏం చెబుతున్నారో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* ఎండ తీవ్రతలకు మనుషులు, జంతువులు విలవిలా
* ఎండ దెబ్బకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు
* ఈ జిల్లాలకు ఎండ తీవ్రత ఎక్కువ
* అధికారులు ఏం చెప్తున్నారు అంటే ?
News 20 : తెలంగాణను వణికిస్తున్న భానుడు. భానుడు దెబ్బకి నిప్పుల కొలిమిలాగ మారిన రాష్ట్రాలు. ఎండలు తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. శుక్రవారం 11 జిల్లాల్లో తీవ్ర వడగండ్లు వస్తాయని భారత వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. ఆ రాష్ట్రాలు వచ్చేసి ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగూర్ కర్నూలు జిల్లాలో ఎండలు తీవ్రత స్థాయిలో ఉంటాయి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, అత్యంత అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఈ సంవత్సరం ఎండలు తీవ్రత రికార్డులు స్థాయికి చేరగా, గురువారం రాష్ట్రంలో దాదాపుగా ఒక్కరోజే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలో నలుగురు చనిపోగా. కరీంనగర్లో ముగ్గురు, అదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. అటు పెద్దపెల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగలలో అత్యధికముగా 46.5 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి అని తెలుస్తుంది.
ఎండ తీవ్రతకు మనుషులే కాదు అటు మూగజీ వాళ్ళు కూడా బలైపోతున్నాయి. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రతకు కోళ్ల ఫామ్ లో వీడికి తట్టుకోలేక వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు వల్ల కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్ నగరాలలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అని ఐఎండి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవైపు ఎండలకి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నంగా మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారులు తెలుపుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0