హైదరాబాద్‌లో వీధి కుక్కల బీభత్సం: 10 కుక్కలు ఒకేసారి బాలుడిపై దాడి.. పరిస్థితి విషమం!
హైదరాబాద్ బి.ఎన్.రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో వీధి కుక్కల దాడిలో సిద్దిపేటకు చెందిన అద్విక్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* మనుషుల పైకి ఎగబడుతున్న వీధి సునకాలు
* అది శునకాలు ఒక బాలుడు పై విరుచుకుపడ్డాయి.
* అధికారులు నిర్లక్ష్యం వల్లనే అంటున్న స్థానికులు
* పూర్తి వివరాల్లోకి వెళితే
సంఘటన స్థలం : హైదరాబాద్
ఎండాకాలం మొదలైతే చాలు వీధి కుక్కల ప్రవర్తన చాలా మారిపోతుంది. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆడుకుంటున్న బాలుడు పై విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషయముగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన బి.ఎన్.రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో సోమవారం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.
వేసవి సెలవులు రావడంతో సిద్దిపేటకు చెందిన అద్విక్, టీచర్స్ కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. సరదాగా ఆడుకుంటుండగా ఒకేసారి 100 వీధి కుక్కలు అతడిపై దాడి చేశాయి. బాలుడి అరుపు విన స్థానికులు వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే కుక్కలన్నీ బాలుడు పై అతి తీవ్రంగా విరుచుకుపడ్డాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అద్విక్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది.
ఈ ఘటనతో కాలనీవాసుల్ని ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది. వీధి కుక్కలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కూడా అధికారులు పట్టించుకోవట్లేదు అని ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగింది అని స్థానికులు ఆగ్రహం చెందారు. వీధి కుక్కలని అదుపులోనికి తీసుకోవాలి అని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0