సీఎం గా రామ్ చరణ్.. పొలిటికల్ ఎంట్రీ ... మెగాస్టార్ రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు!
): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన సీఎం కావాలనే అభిమానుల కోరికపై స్పందిస్తూ, తన కొత్త సినిమా 'పెద్ది' విశేషాలను పంచుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* cm రామ్ చరణ్ అనే నేను
* పొలిటికల్ ఎంట్రీ పై రామ్ చరణ్ క్లారిటీ
* పెద్ది సినిమాపై అభిమానుల్లో ఆరాటం
పెద్ది సినిమా సంబంధించి ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీలక ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు మిమ్మల్ని సీఎం గా చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు, రామ్ చరణ్ రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకోవట్లేదు. నా పూర్తి దృష్టి అంతా నటనపైనే పెట్టాలనుకుంటున్నాను. నటన రంగంలో అగ్రస్థానానికి చేరడమే నా లక్ష్యం అని రాంచరణ్ బదులిచ్చారు.
కొంతకాలం నుంచి రామ్ చరణ్ రాజకీయ ప్రవేశం పై వస్తున్న ఊహగానాలకు పులిస్టాప్ పడింది. రామ్ చరణ్ కు రాజకీయాల్లోనికి రావడం ఇష్టం లేదు అనే స్పష్టత ఆయన ఇచ్చారు. సినిమా రంగంలోనే అగ్రస్థానానికి చేరడమే తన లక్ష్యమని రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రమోషన్ భాగంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
తన కొత్త సినిమా పెద్ది గురించి రాంచరణ్ మాట్లాడుతూ. ఇది తన కెరియర్ లో ఎంతో విలువైన నిజాయితీగా తీసిన చిత్రమని ఆయన వెల్లడించారు. ఈ సినిమా కోసం నేను మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడ్డానని ఆయన చెప్పారు. ఈ సినిమా క్రీడ నేపద్యంలో వస్తుంది తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమ వ్యక్తం చేశారు. ప్రజెంట్ సినిమా జూన్ 4న ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0