సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష.. స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ! డీఎంకే మాస్టర్ ప్లాన్?
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదురవుతున్న తొలి రాజకీయ పరీక్ష స్పీకర్ ఎన్నిక. డీఎంకే అభ్యర్థిగా శక్కరపాణి బరిలో ఉంటారనే వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరగబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురైనట్టేనా
* డీఎంకే సీనియర్ నేత; ఆర్ శక్కరపాణిని అభ్యర్థిగా ఎన్నుకుంటున్నారా
* మంగళవారం జరుగుతున్న స్పీకర్ ఎన్నికపై ఆసక్తి
విజయ్ ప్రభుత్వానికి తొలి రాజకీయ సవాలు ఎదురయింది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే, మంగళవారం జరగనున్న స్పీకర్ ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నయి. టీవీ కే ప్రభుత్వానికి పోటీగా ప్రతిపక్ష డిఎంకె తమ అభ్యర్థిని బరిలోనికి దింపాలని నిర్ణయించింది.
శక్కరపాణిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డిఎంకె తమ స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అని పార్టీ వర్గాలు ప్రచారం. 17వ తమిళ్ నాడు అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగునుంది. ఈ ఎన్నిక విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్షగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల ఎన్నికలు తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణలు చాలా ఆసక్తికరంగా మారాయి. విజయ్ పార్టీని ఎదుర్కోవడానికి డీఎంకే 59 సానాలతో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించగా, అన్నా డీఎంకే 47 సీట్లతో మరో ముఖ్య ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అధికార టీవీ కే పార్టీకి, సిపిఐ, సిపిఎం, వీసీకే, వంటి పార్టీలు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు, సీఎం విజయ్ రెండు స్థానాల్లో గెలిచి, ఒక స్థానానికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నికపై తమిళనాడు రాజకీయ వర్గాలు అన్ని ఎదురుచూస్తూ ఉన్నాయి. విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఇదే, దీనిని ఏ విధంగా ఎదుర్కొంటారో అని తమిళనాడు ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0