తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలో ఒక్క నాయకుడిని కూడా విమర్శించలేదు: పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 12 ఏళ్ల కాలంలో తాను ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా విమర్శించలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి గల కారణాలను ఆయన వివరిస్తూ...
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలు, ఇక్కడి నాయకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ 12 ఏళ్ల కాలంలో తాను ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న ఆకాంక్షలు, ఇక్కడి ప్రజల భావోద్వేగాలను తాను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందుకే ఇక్కడి రాజకీయాలపై గానీ, నాయకులపై గానీ తాను ఎప్పుడూ విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా విమర్శించలేదు
– పవన్ కళ్యాణ్ pic.twitter.com/3YzUmywRqC — Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0