వీటిని కూడా వదలట్లేదుగా! హైదరాబాద్ KBR పార్క్ వద్ద EV ఛార్జింగ్ గన్స్ దొంగతనం!
హైదరాబాద్ బంజారాహిల్స్ KBR పార్క్ గేట్ నంబర్ 4 వద్ద ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ నుండి రెండు EV ఛార్జింగ్ గన్స్, కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విచిత్ర చోరీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వీటిని కూడా దొంగలు ఎత్తుకెళ్తారా? KBR పార్క్ వద్ద EV ఛార్జింగ్ గన్స్ చోరీ!
హైదరాబాద్‌లోని దొంగలు రూటు మార్చారు. ఈ మధ్య కాలంలో బైకులు, కార్లు, సెల్‌ఫోన్లు మాత్రమే కాదు.. ఏది దొరికితే అది నొక్కేస్తున్నారు. తాజాగా నగరంలోని ప్రముఖ కేబీఆర్ పార్క్ (KBR Park) సమీపంలో ఉన్న ఒక పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌పై దొంగలు కన్నేశారు.
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ గేట్ నంబర్ 4 సమీపంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ నుండి దుండగులు రెండు EV ఛార్జింగ్ గన్‌లతో పాటు వాటికి ఉన్న కేబుళ్లను కూడా కట్ చేసుకొని ఎత్తుకెళ్లారు. ఈ విచిత్రమైన దొంగతనం చూసి వాహనదారులు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
వీటిని కూడా దొంగలు ఎత్తుకెళ్తారా?
బంజారాహిల్స్‌లోని #KBRPark గేట్ నంబర్ 4 సమీపంలో ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ నుండి, దుండగులు కేబుళ్లతో సహా రెండు #EV ఛార్జింగ్ గన్లను దొంగిలించిన ఘటన.#banzarahills #evchargingun #Hyderbad #UANow pic.twitter.com/uLnX4f4MoY — UttarandhraNow (@UttarandhraNow) June 10, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0